మహబూబాబాద్, అక్టోబర్ 19 : నియోజకవర్గంలోని ఒక్కో కార్యకర్త 200మంది ఓటర్లు టార్గెట్‌గా పనిచేస్తే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన 36 వార్డులకు బూత్ కమిటీలను నియమించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకుంటానని భరోసానిచ్చారు. అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఇతరులకు చేతికి అప్పగించొద్దని విజ్ఞప్తి చేశారు. మళ్లీ మనం గెలిపిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 76ఏళ్లలో 46 ఏళ్లు కాంగ్రెస్ పార్టే పాలించిందని, దేశానికి, తెలంగాణకు వారు చేసిందేమీ లేదన్నారు. మళ్లీ ఒక్కచాన్స్ అంటూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నమ్మి ఓటు వేయొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, బీమా పథకాలను బీఆర్ఎస్ అమలు చేస్తున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవన్నీ రద్దు చేస్తునందన్నారు. 24 గంటల కరెంట్ కావాలో..
కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనపై నమ్మకంతో బీ ఫామ్ అందించిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు మళ్లీ గెలిపిస్తే పాలేరులా పని చేస్తానన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాని, మళ్లీ దీవించాలని కోరారు. సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రోడ్లు, డ్రైజేజీలు నిర్మించామని, ఇంకా శంకుస్థాపనలు చేసిన పనులు పూర్తి కావాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. 35 రోజులపాటు కష్టపడి పని చేస్తే రానున్న ఐదేళ్లలో కార్యకర్తలు, నాయకులకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మానుకోటను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చామని, రానున్న రోజుల్లో ఇండస్ట్రియల్ హబ్‌గా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మార్నేని వెంకన్న, గద్దె రవి, గోగుల రాజు, పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, చిట్యాల జనార్దన్, గుండా రాజశేఖర్, మార్నేని శ్రీదేవీరఘు, ఎలేందర్, ఎల్లయ్య, సతీశ్, డౌలాగర్ శంకర్, జన్ను మహేందర్, మంగళంపల్లి రాజ్‌కుమార్, పెద్ది సైదులు, మండ విక్రం, యశ్వంత్, గంగాధర్, ప్రభాకర్, సుధగాని మురళి, యాదగిరిరావు, యాళ్ల పుష్పలతారెడ్డి, గుండ స్వప్న, శంకర్మేస్త్రీ, సలీం పాల్గొన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అధిక ప్రాధా న్యం ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురవారం మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మండ విక్రమ్‌గౌడ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు సుమారు వంద మంది శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.