తొర్రూరు, మార్చి 5 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ కేంద్రానికి బీఅర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. తొర్రూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో తొర్రూరులోనిమిషన్ భగీరథ అతిథి గృహంలో సమీక్షించారు.
అనంతరం నేతలు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పారింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధి పై మంత్రి కేటీఆర్ సం బంధిత అధికారులతో సమీక్షిస్తారని ఎర్రబెల్లి తెలిపారు. మహిళా దినోత్పవం సందర్భంగా 20 వేల మంది మహిళలతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ఎన్నో ఏళ్లుగా మహిళా సంఘాలు ఎదురుచూస్తున్న కలను సా కా రం చేయనున్నారు. పావలావడ్డీ, అభయహస్తం చెక్కుల పం పిణీని ఈ వేదిక ద్వారా ప్రారంభించేందుకు యోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో మంత్రి ఎర్రబెల్లి సమావేశమయ్యారు. కేటీఆర్ సభ, జన సమీకరణపై చర్చించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మాట్లాడారు. ఆ రోజు కేటీఆర్‌ను అభ్యర్థించాల్సిన అంశాలపై చర్చించారు. అటు అధికారులు, ఇటు పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో రమేశ్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఆర్ ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాం డ్ల దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మండల, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పాలకుర్తి నుంచి పావలా వడ్డీ, అభయ హస్తం చెక్కుల పంపిణీ
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మహిళలకు పావలా వడ్డీ, అభయ హస్తం చెక్కులు అందజేసే కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు నేతృత్వంలో కో-ఆర్డినేటర్ పంజా కల్పన నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో మంత్రి దయాకర్‌రావు, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పావలా వడ్డీ రుణాలు, అభయ హస్తానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 8న తొర్రూరుకు విచ్చేస్తున్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చెక్కులను అందజేస్తామని, రాష్ట్రంలోనే తొలిసారి పాలకుర్తి నియోజకవర్గం నుంచే చెక్కుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉచిత కుట్టు శిక్షణ విజయవంతంగా కొనసాగుతున్నదని, తొర్రూరు సభలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లను అందజేస్తామన్నారు. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్‌లో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి కల్పిస్తామన్నారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటుంబ ఎదుగుదలకు వినియోగించుకోవాలని, ప్రధానంగా పిల్లల చదువుపై ప్రతి గృహిణి దృష్టి సారించాలన్నారు. పిల్లలను సెల్ ఫోన్లకు బానిసలు కానివ్వ వద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చిందన్నారు. పుట్టిన నాటి నుంచి పెండ్లి చేసుకునే వరకు మహిళల సం రక్షణ కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వితంతు పెన్షన్లు, తాజాగా ఆరోగ్య మహిళ పథకం ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు రూ.18వేల కోట్ల రుణాలను అందజేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయాల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళలు చదువుతోపాటు, ఉపా ధి అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. మంత్రి దయాకర్‌రావు ప్రోత్సాహంతో ట్రస్టు ద్వారా మహిళలు, యు వకులకు అండగా నిలుస్తున్నామని, ట్రస్టులో శిక్షణ పొం దిన అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించడం, స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగడం ఆత్మతృప్తిని కలిగిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్‌కు ఆడబిడ్డలపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. మహిళా సంఘా లు ఆర్థిక పురోగతి సాధించే శాఖకు మంత్రి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహించడం పాలకుర్తి నియోజకవర్గ మహిళలకు అదృష్టమన్నారు.