భూపాలపల్లి రూరల్, నవంబర్ 8: రేబిస్ వ్యాక్సిన్ వికటించి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్‌నగర్‌కు చెందిన గరిసెల రజిత(37) మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రజితకు 20 రోజుల క్రితం కుక్క కరవగా వెంటనే జిల్లా కేంద్రంలోని వంద పడకల దవాఖానకు తీసుకెళ్లారు.
నిబంధనలు పాటించకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఫ్రిజ్‌లో పెట్టని రేబిస్ ఇంజక్షన్‌ను వేయడంతో ఆమె శరీరంలోని అవయవాలు పాడయ్యాయి. వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద దవాఖానకు తర లించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వంద పడకల దవాఖాన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె భర్త కోరారు.