దామెర, డిసెంబర్ 18: ‘రాజకీయాల్లో గెలు పోటములు సహజం.. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తాం’ అని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో జరిగింది. నియోజకవర్గంలోని పరకాల, మున్సిపాలిటీ, నడి కూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, జీడబ్ల్యూ ఎంసీ డివిజన్లు, సంగెం మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయ కులు పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి పెద్ద ఎత్తు న హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించు కుని రెండు పర్యాయాలు ప్రజా సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పాలన కొన సాగించి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపా రు. ప్రజల తీర్పును గౌరవిస్తా.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అధికారంలో లేకున్నా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.
కార్యకర్త లను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, బీఆర్ ఎస్ ఉద్యమ పార్టీ అని, పోరాటాలు కొత్త కావని అన్నారు. ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని చూసి కార్యక ర్తలు బాధపడవద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు కొత్తకావని, వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలో గృహలక్ష్మీ పథకంలో నిర్మిం చుకునే ఇండ్లకు బిల్లులు చెల్లించాలని జిల్లా ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏవిధంగా జరుగుతుందో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. సమావేశంలో ఎంపీపీలు కాగితాల శంకర్, మచ్చ అనసూర్యా రవీందర్, కందగట్ల నరహరి, జడ్పీటీసీలు కల్ప న, మొగిలి, కార్పొరేటర్లు శివ, గిద్దె బాబు, మనో హర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సుధాకర్‌రెడ్డి, పీఏ సీఎస్ చైర్మన్ దొంగల రమేశ్, బొల్లు రాజు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు రామకృష్ణ, చందు, రా జుకుమార్, కందగట్ల నరహరి, చంద్రమౌళి, లేతా కుల సంజీవరెడ్డి, ముదిగొండ కృష్ణ, మడికొండ శ్రీను, సోదా రామకృష్ణ, కృపాకర్‌రెడ్డి, దాడి రమే శ్, మల్లయ్య, హింగె శ్రీనివాస్ పాల్గొన్నారు.