మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేశారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని నిత్య బాంక్వెట్ హాల్లో మైనార్టీ మేధావులు, విద్యావంతుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
- చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
- బీఆర్ఎస్కు పలు సంఘాల మద్దతు
హనుమకొండ, నవంబర్ 17 : గతంలో ఏ ప్రభు త్వం చేయని విధంగా మైనార్టీల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేశారని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని నిత్య బాంక్వెట్ హాల్లో మైనార్టీ మేధావులు, విద్యావంతుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వినయ్ భాస్కర్‌కు తమ సంపూర్ణ మద్దతును పక్రటిస్తున్నట్లు మైనార్టీలు మేధావుల సంఘం నాయకులు ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి చీఫ్‌విప్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బ్లూ బర్డ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ మజీద్, ఖాదీ బోర్డ్ చైర్మన్ మౌలానా యూసుఫ్ జహీర్, ఎంఐఎం ప్రెసిడెంట్ అబ్దుల్ సాహెబ్, జమా హిందు ప్రెసిడెంట్ మౌలానా ఆయూబ్ క్వాస్మీ , మౌలానా అబ్దుల్ రషీద్, ఎంకే నజరీన్ మౌలానా, అబ్బాస్, మాజిద్, ఎండీ కలిముల్లా ఖాన్, డాక్టర్ జియాజుద్దీన్, మహ్మద్ మసూద్ గులాం, సర్వర్ మున్నా, మహ్మద్ యాకూబ్, అబ్దుల్ కుదుస్, షఫీ, నయీమ్, అక్రమ్, మైనార్టీ డాక్టర్లు, అడ్వకేట్స్, ఐటీ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో..
నయీంనగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు క్రెడాయ్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు కేయూ క్రాస్‌రోడ్డులోని క్రెడాయ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం క్రెడాయ్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికల్లో తమ వంతు కృషి చేసి వినయ్‌భాస్కర్‌ను గెలిపిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాడ పురుషోత్తం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

