సుబేదారి, జూన్ 22 : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు నెలలోపు రాష్ట్రంలో రూ. 2 లక్షల పం ట రుణాలు మాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకే విడుతలో రుణాలు మాఫీ చేస్తున్న ఘటన దేశంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 336 సహకార సంఘాల ద్వారా 7.75 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారని, వీరందరికీ ఆగస్టు లోపు రూ. 5,048 కోట్ల రుణాలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 87,432 రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రైతుల సంక్షేమ కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. తనకు టె స్కాబ్ చైర్మన్ పదవి అప్పగించిన సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉ మ్మడి జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురే ఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞత లు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు కక్కిరాల హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్, నర్సింగారావు, జగన్మోహన్రావు, బ్యాం కు సీఈవో వాజీర్సుల్తాన్, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.