హసన్‌పర్తి, నవంబర్ 20: అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్‌పల్లి, పెంబర్తి, గంటూర్‌పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి గ్రామాల్లో అరూరి మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. అనంతరం మహిళలు, పార్టీ శ్రేణులు కోలాటాలు, డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్కౌంటర్ల పేరుతో అమాయక ప్రజలకు కాల్చి చంపి, డబ్బులు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటును కొనుక్కొని, ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్న వారు కావాలా? అభివృద్ధి చేసిన వారు కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెంట్ మూడు గంటలే వస్తుందని చెప్పారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపిస్తే మరిన్ని సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు.
కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల తర్వాత తెల్లరేషన్ కార్డుకు సన్నబియ్యం, రూ.400కే గ్యాస్ సిలిండర్‌తోపాటు గృహలక్ష్మి, బీసీబంధు, దళిత బంధును అర్హులందరికీ దశలవారీగా అందజేయనున్నట్లు చెప్పారు. రైతు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితాయాదవ్, రైతు రుణవిమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెసరు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, సర్పంచ్‌లు బొల్లవేణి రాణీరాజు, అమితాజీవన్రెడ్డి, జనగాం శరత్‌కుమార్, పెద్ది తిరుపతమ్మ మల్లారెడ్డి, ఐలయ్య, అరుణ్, ఎంపీటీసీ పల్లె విజయా చంద్రకుమార్, ఇంద్రయ్య, దీపీక, సుమతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, కొయ్యడ గోపికృష్ణ, తంగళ్లపెల్లి సురేశ్, బుర్ర రాజు రవి, సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు పోగుల రాజకొమురయ్య, ఉపాధ్యక్షుడు భిక్షపతి, ఉప సర్పంచ్ రంజిత్ , రమేశ్ రవి, కరుణాకర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రంజిత్, సాగర్, శ్రీను, పరమేశ్వర్, రాజు పాల్గొన్నారు.
హసన్‌పర్తి, 20: బీఆర్ఎస్ ప్రచార రథాన్ని ఇద్దరు యువకులు మద్యం మత్తులో ధ్వంసం చేసిన ఘటన సోమవారం అనంతసాగర్‌లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ సోమవారం మండలంలోని అనంతసాగర్‌లో ప్రచారం చేస్తుండగా ప్రచార రథం గ్రామంలో తిరుగుతున్నది. రథం వెనుక ఇదే గ్రామానికి చెందిన బండ కార్తీక్‌రెడ్డి, తంగళ్లపెళ్లి నవీన్ బైక్‌పై వచ్చారు. మద్యం మత్తులో వీరు హారన్ కొట్టినా సైడు ఇవ్వలేదని రథం డ్రైవర్‌తో వాదనకు దిగారు. కంకరరాళ్లతో అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్, సీఐలు, ఎస్సైలు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
వర్ధన్నపేట: కాంగ్రెస్ వ్యవసాయానికి మూడు కరెంటు గంటలే ఎకరం కూడా పారదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24గంటల కరెంటు ఇస్తున్నందున నాకున్న ఆరు ఎకరాలు పండించుకుంటాన. గతంలో 5గంటలు మాత్రమే ఇవ్వడం వల్ల పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. అప్పులపాలై ఇబ్బందులకు గురైనం. కేసీఆర్ పాలనలో సాగునీటి వసతి పెరిగి, 24గంటలు ఉచితంగా కరెంట్ రెండు పంటలు పండించుకుంటానం. రైతులు ఏమాత్రం నమ్మరు. రైతులం ఇప్పుడిప్పుడే బాగుపడతానం. కాంగ్రెస్ వస్తే రైతుల పరిస్థితి ఆగమైతది. రైతులు ఎవ్వలు కూడా కాంగ్రెస్‌కు ఓటు ఎయ్యరు. సీఎం కేసీఆర్ సారే రావాలని కోరుకుంటాండ్లు.
వర్ధన్నపేట:తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత చాలా సమస్యలు తొలిగాయి. భూమ్మీద హక్కులు పూర్తిగా వచ్చాయి. గతంలో ఒకరి పేరు మీది భూమి మరొకరికి అయి మస్తు గోసపడ్డం. నాడు పట్వారికి పైసలిస్తెనే పహానీ చేతికచ్చేది. రికార్డుల భూములు కూడా వాళ్ల ఇష్టమచ్చినట్టు మార్చేటోళ్లు. భూములు అమ్మినా, కొన్నా పేర్లు మార్వాల్నంటే ఏండ్లు పట్టేది. కానీ సీఎం కేసీఆర్ సార్ ధరణి తెచ్చినంక ఏ చిక్కూ అమ్మినా, కొన్నా ఎంబడే పేర్లు మారుతానయ్. కానీ కాంగ్రెసోళ్లు ధరణిని తీసేస్తమని, పట్వారీ వ్యవస్థ తెస్తామని చెప్తున్నరు. వాళ్లకు అధికారం ఇచ్చి గోస పడుడెందుకు?. రైతులెఎవ్వరు సుత కాంగ్రెస్‌ను అస్సలే నమ్మరు.