దామెర/ఆత్మకూరు, నవంబర్ 5 : సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, వారి ఆశీర్వాదంతో భారీ మెజార్టీ సాధించి పరకాల నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం దామెర మండలంలోని కోగిల్వాయి, వెంకటాపురం, సింగరాజుపల్లి, ల్యాదెళ్ల గ్రామాల్లో, రాత్రి ఆత్మకూరు మండలం కటాక్షపురం, హౌసుబుజుర్గు, నీరుకుళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చల్లాకు మంగళ హారతులు, బతుకమ్మలతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. రేవూరి ప్రకాశ్‌రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని వదిలి స్వార్థం కోసమే పరకాల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడని ఆరోపించారు. ఏనాడైనా నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నాడా? అని ప్రశ్నించారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశానన్నారు. ప్రజలు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే రూ.15లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీడు భూములను సాగులోకి తెచ్చారని తెలిపారు.
ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద అర్హులైన ప్రతి మహిళకు రూ.3వేలు, ఇండ్లను మంజూరు చేస్తామని, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. బీజేపి అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని కోరుకోలేదని ఆరోపించారు. పదేండ్లకు ముందు ఆత్మకూరు మండలం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో గమనించాలన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితిలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. రా్రష్ట్రంలో సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులకు అందుతున్నాయన్నారు. మళ్లీ కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. అలాగే దామెర మండలం పులుకూర్తికి చెందిన 79వ బూత్ బీజేపీ అధ్యక్షుడు తోట రాజు, ప్రచార కార్యదర్శి పెంచాల సంతోష్, పెంచాల భరత్, రామనాథం, పెంచాల సతీశ్, పెంచాల మణిదీప్, రామచంద్రం, మాదారపు సాంబయ్య, కనకయ్య బీఆర్ఎస్లో చేరారు. అలాగే ఊరుగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు మెంబర్ లకిడె మౌనికాలక్ష్మణ్, వేల్పుల కిరణ్, దామసాని ప్రవీణ్ బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్‌అలీ, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గట్ల విష్ణువర్థన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, సర్పంచ్‌లు పున్నం రజితాసంపత్, రజిత, కుక్క శ్రావణ్యాఅనిల్, గోగుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు పోలం కృపాకర్‌రెడ్డి, మౌనికాకిరణ్, మండలాధ్యక్షుడు గండు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, మండల కో ఆప్షన్ సభ్యుడు అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్లు గుండా చంద్రమోహన్, దుబాసి అనిల్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, సిలివేరు నర్సయ్య, యూత్ మండలాధ్యక్షుడు మెంతుల రాజు, నాయకులు మేకల సంపత్, శివ, తోట బాబు, కునాటి సునీల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు గొల్కొండ సాంబయ్య, జన్ను విద్యాసాగర్, మాజీ ఎంపీటీసీలు కమలాకర్, కన్నెబోయిన రమేశ్, కొసనం సత్యనారాయణ, మాదాసు వెంకన్న, ముప్పు రామస్వామి, పుల్యాల రఘుపతిరెడ్డి, ఆత్మకూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్‌లు మచ్చిక యాదగిరి, రబీయాబీ హుస్సెన్, అర్షం బలరామ్, రంపీస మనోహర్, బీఆర్ఎస్ నాయకులు దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, గుండెబోయిన బాలకృష్ణ పాల్గొన్నారు.