CPI (ML) | ఖిలా వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు బండి కోటేశ్వరరావు అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు హామీలను అమలు చేసేంతవరకు విడతలవారీగా విభిన్న రూపాలలో నిరసనలు, ఆందోళనలు చేపడతామన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛపై వాగ్దానం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన వారిపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని విమర్శించారు.
అర్హులైన ప్రతీ రైతుకు రుణమాఫీ, రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లిన వారిలో నాయకులు రాచర్ల బాలరాజు, హరిబాబు, ఇనుముల కృష్ణ, మర్రి మహేష్, మైదం సంజీవ, సుద్దాల వీరయ్య, ప్రభాకర్ రాజు తదితరులు ఉన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!