‘నేషనల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్’ ప్రారంభించండి
క్యాన్సర్ ముందస్తు గుర్తింపునకు ‘నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్' ప్రారంభించాలని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారథిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు చేపట్టాలని కోరారు.
- క్యాన్సర్ వ్యాధి ముందస్తు గుర్తింపునకు ఇది అత్యవసరం
- రాజ్యసభలో ఎంపీ పార్థసారథిరెడ్డి
- హైదరాబాద్లో పేదల కోసం దవాఖాన ఏర్పాటు చేసినట్టు వెల్లడి
- ఎంపీలు సందర్శించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ ముందస్తు గుర్తింపునకు ‘నేషనల్ మాస్ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్’ ప్రారంభించాలని రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ బీ పార్థసారథిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు కేంద్రం పకడ్భందీ చర్యలు చేపట్టాలని కోరారు. దేశం క్యాన్సర్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా సాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్క్రీనింగ్ ప్రక్రియకు వసతులు లేకపోవడం, ప్రజల్లో క్యాన్సర్ ముందస్తు లక్షణాలపై అవగాహన లేకపోవడం సమస్యగా మా రిందని పేర్కొన్నారు. మన దేశంలో క్యాన్సర్ చికిత్స, మందులు ఖర్చు తో కూడుకోవడంతో పేదలు ఆ స్థాయిలో డబ్బు వెచ్చించలేకపోతున్నారని వివరించా రు. క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున మెడికల్, సర్జికల్, రేడియేషన్ అంకాలజిస్టుల సంఖ్య పెంచాలని కోరారు.
ముందస్తు లక్షణాలు గుర్తించకపోవడంతోనే..
దేశంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ చికిత్స సెంటర్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో ఉన్నాయని పార్థసారథిరెడ్డి గుర్తు చేశారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పేషెంట్లు దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స తీసుకోవడం కష్టతరంగా మారుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాట్ ఫర్ ప్రాఫిట్’ క్యాన్సర్ దవాఖానలకు కేంద్రం కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.
క్యాన్సర్ చికిత్సకు 1500 బెడ్లతో దవాఖాన
సామాజిక బాధ్యతగా హైదరాబాద్లో 1500 బెడ్లతో సింధు హాస్పిటల్ నిర్మించినట్టు పార్థసారథిరెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులంతా ఒకసారి ఈ దవాఖానను సందర్శించాలని ఆహ్వానించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు ఉంటే సింధు దవాఖానకు రిఫర్ చేయాలని ఆయన కోరారు. వాళ్లందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉచిత చికిత్స పొందాలనుకునేవారు 9394010215 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

