e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు కరోనా బాధితులు అధైర్యపడొద్దు

కరోనా బాధితులు అధైర్యపడొద్దు

కరోనా బాధితులు అధైర్యపడొద్దు

నర్సంపేట, మే16 : కరోనా బాధితులు అధైర్యపడొద్దని, నర్సంపేట ఏరియా దవాఖానలో మరో 20 బెడ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఏరియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 30 బెడ్లు ఉన్నాయని తెలిపారు. అదనంగా మరో 20 ఆక్సిజన్‌తో కూడిన బెడ్లు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనే నర్సంపేట ఏరియా దవాఖానలో అత్యధికంగా ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయన్నారు. ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేయడానికి సహకరించిన జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మనోధైర్యమే కరోనా బాధితులకు అసలైన మందని, ఇంట్లో ఉండడానికి వీలు కాకపోతే నర్సంపేటలో ఏర్పాటు చేసిన ఉచిత ఐసొలేషన్‌ సెంటర్‌కు రావాలన్నారు.
పట్టణానికి మహర్దశ
నర్సంపేట పట్టణానికి మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రూ.5 కోట్లతో పాకాల ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధం గా 1000 సీట్ల సామర్థ్యంతో అధునాతన హంగులతో ఆడిటోరియం నిర్మాణం పూర్తికావొస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్‌ గుంటి కిషన్జ్రని, ఏఈ, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితులు అధైర్యపడొద్దు

ట్రెండింగ్‌

Advertisement