జనగామ, మే 29 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జనగామ పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని హైదరాబాద్ ప్రధాన రహదారిపై 60 ఫీట్ల రోడ్డు వరద ముంపు ప్రాంతాలను పాదయాత్ర ద్వారా పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ పట్టణ అభివృద్ధిని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో భారీ వర్షాలు కురుస్తే ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంగా మారిన పట్టణాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ది చేసుకునేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే పట్టణ సుందరీకరణ కోసం కేటీఆర్ రూ.30కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు విస్తరణ, అమ్మబావి నుంచి పెద్దడ్రైనేజీ నిర్మాణం వంటి పనులు చేశామన్నారు.
ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు రంగప్పచెరువు మత్తడి పోస్తే ప్రవహించే వరదవల్ల ముంపునకు గురవుతున్న కాలనీలు, నీట మునుగుతున్న హన్మకొండ-హైదరాబాద్ హైవే పరిస్థితిని వివరించిన వెంటనే డ్రైనేజీ పనులకు రూ.9 కోట్లు విడుదల చేశారని ముత్తిరెడ్డి తెలిపారు. ఇటు రంగప్పచెరువు, అటు అమ్మబావి పెద్దడ్రైనేజీ నుంచి వచ్చే ఫ్లో నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సర్వేచేయించామని, అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రుపార్కు రోడ్డును వెడల్పు చేసుకున్న ఫలితంగా వినియోగదారులకు పార్కింగ్ సదుపాయం ఏర్పడి వ్యాపారాలు వృద్ధి చెందాయని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చే సరుకులు, సామాగ్రి ఇప్పుడు జనగామలో అందుబాటులోకి వచ్చిందన్నారు. రంగప్పచెరువు గతంలో నిండేది కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల నీటితో చెరువు నింపడం, వర్షపునీరు తోడై మత్తడి పారుతున్నదని చెప్పారు. రంగప్పచెరువు వరదనీరు కాలనీలల్లో చేరి రోడ్లు నీట మునిగుతున్నాయని, భవిష్యత్‌లో ఎంతపెద్ద వరద వచ్చినా నీటి ప్రవాహం సజావుగా వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ రోడ్డులోని జీడికల్ కమాన్ నుంచి గార్లకుంట వరకు 9 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతుతో భారీ బాక్స్‌టైపు డ్రైనేజీ నిర్మించి వరదనీటిని మళ్లిస్తామని చెప్పారు.
దీనికి సంబంధించి క్షుణ్ణంగా సర్వేచేసి డీపీఆర్ తయారు చేయించి బాక్స్డ్రైనేజీ నిర్మించే ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తం భాలు, ట్రాన్స్ఫార్మర్ల తరలింపు, రోడ్డు వెడ ల్పు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సెయింట్‌మేరీస్ స్కూల్ రోడ్డులో టౌన్ ప్లానింగ్ నిబంధనలు అతిక్రమించి జరిపిన కట్టాలను మార్కింగ్ చేసి వెంటనే కూల్చివేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. వరద, మురుగునీటిని వ్యవసా యం, ఇతర అవసరాలకు వినియోగించుకునేందు కు వీలుగా గార్లకుంట వద్ద ఎస్టీపీ ప్లాంట్ (మురుగు నీటి శుద్ధి ప్లాంట్) ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపి నిధులు సాధించుకుంటామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల గ్రామా లు, పట్టణాలు సుందరీకరణ జరుగుతున్నాయని చె ప్పారు. తెలంగాణ అభివృద్దిని స్వయంగా ప్ర ధానమంత్రి ప్రశంసించారని, మిషన్ భగీరథ ఇంటింటికీ మంచినీళ్ల పథకాన్ని కేంద్ర మంత్రి షెకావత్ ప్రశంసించి ఇతర రాష్ర్టాల్లో అమలుకు సన్నాహాలు చేస్తున్నారని ముత్తిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు వాకుడోత్ అనిత, స్వరూప, దేవరాయి నాగరాజు, మారబోయిన పాండు, దయాకర్, మార్కెట్ డైరెక్టర్ చిన్నం నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు మల్లిగారి రాజు, ఉడుగుల నర్సింహులు, మామిడాల రాజు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, డీఈఈ చంద్రమౌళి పాల్గొన్నారు.