కాశీబుగ్గ, మార్చి14: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్రభాకర్ 17 బస్తాలు మార్కెట్‌కు తీసుకువచ్చారు. జారతి సంపత్‌కుమార్ అడ్తి ద్వారా సిరివల్లి ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10,235తో కొనుగోలు చేశా రు. పత్తికి అధికంగా ధరలు పలుకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలం కలిసిరాక పత్తి దిగుబడి చాలా వరకు తగ్గినందున ధరలు పెరుగడంతో కాస్త ఊరట కలిగిస్తోందని పేర్కొంటున్నారు. మంగళవారం మార్కెట్‌కు సు మారు 4 వేల పత్తి బస్తాలు వచ్చినట్లు అధికారులు సూచించారు.