జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పది వేల మంది జనగామ పట్టణానికి వెళ్లారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించింది.
వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 11: టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు జనగామ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సభకు వరంగల్ తూర్పు శ్రేణులు ఫుల్ జోష్‌తో కదిలారు. పలు డివిజన్ల నుంచి ఆజాంజాహి మిల్ గ్రౌండ్‌కు తరలిన పార్టీ శ్రేణులు.. అక్కడి నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జనగామలో ఏర్పాటు చేసిన సభాస్థలికి 150 బస్సుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ సుమారు పది వేల మంది తరలివెళ్లారు. ముందుగా మైదానానికి చేరుకున్న ఎమ్మెల్యే బస్సుల ఇన్చార్జిలకు రూట్ మ్యాపు తెలియజేశారు. అనంతరం బతుకమ్మ ఆటలు, డప్పుచప్పుళ్ల మధ్య కోలాటాలు ఆడుతూ.. ఆదివాసీ కళాకారుల గుస్సాడీ నృత్యాలు, డీజే సౌండ్స్‌తో గ్రౌండ్ నుంచి వెంకటరమణ జంక్షన్ వరకు పాదయాత్ర చేస్తూ ర్యాలీగా బయల్దేరిన పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే ముందు నడిచారు. అక్కడి నుంచి డివిజన్ల వారీగా బస్సులు బయల్దేరి కాశిబుగ్గ సెంటర్, పోచమ్మమైదాన్, ఎంజీఎం జంక్షన్, పోతనరోడ్, హంటర్‌రోడ్డు మీదుగా ఉర్సుగుట్ట బైపాస్ చేరుకున్నాయి. అక్కడి నుంచి కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా సభాస్థలికి బయల్దేరి వెళ్లారు.
దేశంలో బీజేపీని నమ్మే రోజులు పోయాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమాన్ని నిరాటంకంగా కొనసాగించిన సీఎం కేసీఆర్ వైపు అందరిచూపు మళ్లుతున్నదన్నారు. తెలంగాణలో అభివృద్ధిని ఓర్వలేని ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపి వేసి విషం చిమ్ముతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది మోదీలు వచ్చినా ఎదుర్కొనేందుకు ఒక్క కేసీఆర్ చాలని హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు యావత్ దేశాన్ని అవమానించడమేనన్నారు. దేశం తెలంగాణ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని తెలిపారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాగా, బస్సు ఎంజీఎం రోడ్డు మీదుగా వెళ్తున్న క్రమంలో హఠాత్తుగా బ్రేక్ డౌన్ కావడంతో ముగ్గురు మహిళా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారిని ఎంజీఎం దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రమాదమేమీ లేదని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు చెప్పడంతో తిరిగి బస్సులో జనగామకు వెళ్లారు.
జనగామలో జరిగిన సీఎం కేసీఆర్ సభకు వరంగల్‌లోని పలు డివిజన్ల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. 12, 13, 21, 22, 23 డివిజన్ల నుంచి కార్పొరేటర్లు, డివిజన్ బాధ్యుల ఆధ్వర్యంలో బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్ కవిత ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివెళ్లారు. కార్పొరేటర్లు ఎండీ ఫుర్కాన్, సురేశ్‌కుమార్ జోషి, పార్టీ బాధ్యుడు మావురపు విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బైలెళ్లారు.
జనగామలో జరిగిన సీఎం సభకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వరంగల్ 3వ డివిజన్లోని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట నుంచి టీఆర్ఎస్ శ్రేణులు బయల్దేరగా కార్పొరేటర్ జన్ను షిబారాణి-అనిల్, పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం ఉమ్మడి జిల్లా కోశాధికారి ఇట్యాల హరికృష్ణ వేర్వేరుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. 14వ డివిజన్లో కార్పొరేటర్ తూర్పాటి సులోచన, 18వ డివిజన్లో కార్పొరేటర్ వస్కుల బాబు బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, నాయకులు జక్కం దాసు, ప్రవీణ్, యాసిన్, ముడుసు నరసింహ, గండ్రాతి భాస్కర్, కేతిరి రాజశేఖర్, గంధం గోవిందు, పత్రి సుభాష్, కొత్తపెల్లి అనిల్ పాల్గొన్నారు. వరంగల్ 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీషా శ్రీమాన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పోచమ్మమైదాన్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనగామకు తరలివెళ్లారు. టీఆర్ఎస్ నాయకులు ఎండీ మస్తాన్, మట్టెవాడ శీను, సిరిసిల్ల శీను, కోటి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ 29వ డివిజన్ నుంచి పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాచర్ల రాము, కార్యకర్తలు తరలివెళ్లారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి సీఎం సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపు మేరకు టీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో తరలివెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు బానాల ఇందిర, దార్ల రమాదేవి, శీలం రాంబాబు, పాషా, దేవోజు తిరుమల-సదానందం, వీరన్ననాయక్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, పెండ్యాల యాదగిరి, రాయరాకుల సారంగం, పెండెం వెంకటేశ్వర్లు, మండల శ్రీనివాస్, చుక్క అనిల్, కొంకీస కుమార్, మద్దెల సాంబయ్య, పట్నాటి సాంబయ్య, మంద ప్రసాద్ పాల్గొన్నారు.
జనగామలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో జనగామకు తరలివెళ్లారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాల అధ్యక్షులు, వర్ధన్నపేట పట్టణానికి చెందిన మున్సిపల్ పాలక మండలి ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కర్పూరపు శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, గ్రామ అధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మండల నాయకుడు బక్కి కుమారస్వామి పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు సీఎం సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ నేతృత్వంలో గ్రామాల వారీగా నాయకులు, శ్రేణులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ వాహనాల్లో వెళ్లారు.
జనగామలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభ టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పది వేల మందితో సీఎం సభకు బయల్దేరారు. ముందుగా మహిళలు బతుకమ్మ, బోనమ్మలతో ఆజంజాహి మిల్ గ్రౌండ్‌కు తరలిరాగా, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్టెప్పులేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. పండుగ వాతావరణంలో సీఎం కేసీఆర్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల మంది సభకు హాజరయ్యారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి గ్రామం, వార్డు నుంచి టీఆర్ఎస్ శ్రేణులు జనగామ సభకు హాజరయ్యారు. వీరిలో నల్లబెల్లి జడ్పీటీసీ, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్నతోపాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ మండల, గ్రామ కమిటీలు, రైతుబంధు సమితి నేతలు ఉన్నారు. వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్‌తూర్పు ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్ జనగామలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.