చైర్మన్ పీఠం దక్కేదెవరికో?
మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక చైర్మన్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని ఎదురు చూస్తున్నారు. కీలక పదవి కోసం ఇప్పటికే ఆశావహులు పైరవీలు షురూ చేశారు.
- ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు
- రహస్య క్యాంపుల్లో కాంగ్రెస్ సభ్యులు
- భువనగిరి చైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి
- రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికయాదాద్రి జిల్లాలో పదవి కోసం కౌన్సిలర్ల పైరవీలు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక చైర్మన్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని ఎదురు చూస్తున్నారు. కీలక పదవి కోసం ఇప్పటికే ఆశావహులు పైరవీలు షురూ చేశారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గాంధీ భవన్‌లోని గాడ్ ఫాదర్లతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. పోచంపల్లిలో హంగ్ రావడంతో గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించారు. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5 స్థానాలు దక్కించుకున్నాయి. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిని సైతం వేర్వేరు శిబిరాలకు పంపించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ ఇద్దరు క్యాండిడేట్లకు మస్తు డిమాండ్ పలుకుతోంది. భారీ మొత్తంలో వెనకేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
రేసులో ఎవరంటే..?
- భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక తలనొప్పిగా మారనుంది. ఇక్కడి నుంచి సీనియర్లు ఉండటంతో పాటు జనరల్ స్థానం కావడంతో పీఠం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి శ్రీవాణి రవి, గంజి శ్రీవాణి గణేశ్, బర్రె జహంగీర్, గుర్రాల శ్రీను పేర్లు వినిపిస్తున్నాయి. వైస్ చైర్మన్ పదవికి ఐదారుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం.
- యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా గుండ్లపల్లి వాణి భరత్ దాదాపు ఖాయమైనట్లే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బూడి ద మధు, బరిగె రమ్య, కాటబత్తిని స్వప్న తమకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని వేర్వేరుగా కోరుతున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను కలిసి విన్నవించుకున్నట్లు తెలిసింది.
- ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా బిజని బాలమణీభాస్కర్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శనివారం మీడియా సమావేశంలోనూ బీర్ల ఐలయ్య ఇదే విషయాన్ని వెల్లడించారు. వైస్ చైర్మన్ రేసులో మల్లెల సరిత, జూకంటి సంపత్, జిట్టా సరిత ఉన్నారు.
- భూదాన్ పోచంపల్లిలో చైర్మన్‌గా తడక వెంకటేశ్వర్లు పదవి చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈయన ఎన్నిక దాదాపు ఎన్నికైనట్లే అనే ప్రచారం జరుగుతున్నది. వైస్ చైర్మన్ రేసులో కొయ్యడ రజిని, శ్రీను ఉన్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి జినుకల లావణ్యతో మంతనాలు జరిపాక వైస్ చైర్మన్ పదవి ఖాయం కానుంది.
- మోత్కూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ రేసులో కుర్మిండ్ల ప్రమీ లతతరాములు, మెంట రమణామహేశ్, గడ్డం స్వప్నాసోమనర్సయ్య ఉన్నారు. పల్లెర్ల వెంకన్న, గణగాని శైలజ నరసింహ, బీసు శ్రీకాంత్, పారుబోతుల వెంకన్న, శ్రీవిద్య శ్రీనివాస్‌రెడ్డి వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఎవరిని వరిస్తుందో చూడాలి.
- చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ రేసులో బత్తుల వాణి విప్లవ్, మొగుదాల పావని రమేశ్ ఉన్నారు. ఇక్కడ వెన్ రెడ్డి రాజు ఓటమి చెందడంతో కొత్త వారికి అవకాశం దక్కనుంది. వైస్ చైర్మన్ రేసులో రాకేశ్ రెడ్డితో పాటు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

