కాంగ్రెస్‌కు మొండిచేయి.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పరాజయం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
- పదకొండు స్థానాలకే పరిమితం
- టికెట్ల పంపిణీలో వర్గపోరు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలు వార్డుల్లో హస్తం పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. టికెట్ల పంపిణీ నుంచి ఆ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యా. గతంలో ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లు తమకు టికెట్ వస్తుందని ఆశతో ఉండగా.. గ్రూపు రాజకీయాలతో ఆశావహులకు టికెట్లు దక్కలేదు. దీంతో పలు వార్డుల్లో వారి రెబల్స్‌గా పోటీ చేశారు.
ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టికెట్లను ఫైనల్ చేయగా, కొందరు నాయకులు ఆయనను పక్కదారి పట్టించి తమ వారికి టికెట్లు ఇప్పించారనే చర్చ జరిగింది. టికెట్లు ఆశించిన రాని వారు నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో విస్తృతంగా ప్రచా రం నిర్వహించిన ప్రజలు తిరస్కరించారు.
నిరాశలో నాయకులు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తక్కువ సీట్లు దక్కడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చైర్మ న్ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు ఫలితాలకు ముం దుగానే తమ అభ్యర్థులతో వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. తీరా 11 సీట్లు రావడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. పలు వార్డుల్లో సిట్టింగ్ కౌన్సిలర్లుకౌన్సిలర్లు ఓడిపోయారు. దీంతో క్యాడర్లో తీవ్ర ని రుత్సాహం నెలకొన్నది. తాము విజయం పక్కగా గెలుస్తా మనుకున్న వార్డుల్లో ప్రజలు ఆదరించక పోవడంతో నాయకులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

