హనుమకొండ చౌరస్తా, జూన్ 3: వరంగల్ జిల్లా క్రికెట్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. మే 19 నుంచి జూన్ 3 వరకు జరిగిన హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ఆరు అంతర్ జిల్లాల క్రికెట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న ప్రతి జట్టు 5 మ్యాచ్‌లో పాల్గొన్న క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యంత ప్రతిభకనబరిచిన ఉత్తమ 19 మంది జట్టును సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్, అప్జల్, పవన్ పర్యవేక్షణలో తుది జట్టును ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఎంపికైన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఈనెల రెండో వారంలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న హెచ్‌సీఏ టుడే లీగ్ పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. జట్టు వివరాలు: .బి.వరుణ్(కెప్టెన్), కె.రోహిత్‌రెడ్డి, ఎం.శివరామ్, ఎన్.రాహుల్, ఏ.లక్ష్మణ్, ఎం.దేవేందర్, పి.రిశ్వంత్, ఎం.రామ్‌చరణ్, ఎస్.ఆదర్శ, ఎం.రోహిత్, వి.వైష్ణవ్, జె.పార్దిపన్, డి.మనోజ్, బి.మణిదీప్‌సింగ్, ఎం.రానాచరన్, నితిన్పటేల్, పి.సంతోష్, బి.సతీష్, పూజిత్ ఉన్నారు.