చెన్నారావుపేట, ఆగస్టు21 : యూరియా కొ రత లేదన్న వరంగల్ కలెక్టర్ వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నాం. యూరియా కొరత లేకుంటే వందల మంది రైతులు పనులు వదులుకొని గంటల తరబడి ఎందుకు వేచి ఉన్నా రో సమాధానం చెప్పాలి. కలెక్టర్ కాంగ్రెస్ ప్ర భుత్వ ఏజెంట్లా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివి వినిపిస్తున్నది. రాష్ట్రం నుంచి ఎన్నికైన 16 మంది ఎంపీల అసమర్థత కారణంగా రైతులు యూరి యా కోసం ఇబ్బంది పడుతున్నారు.
కేసీఆర్ అ ధికారంలో ఉన్నప్పుడు ఖరీఫ్ ప్రారంభం నాటి కే 50 శాతం యూరియాను రైతులకు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి ముందు చూపు లేకపోవడం, వ్యవసాయంపై కనీస అవగాహన లేకపోవడంతో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వృద్ధుల నుంచి విద్యార్థుల వరకూ యూరియా కోసం లైన్లో నిలబడేలా చేసిన రేవంత్‌రెడ్డి సిగ్గుపడాలి. రైతులకు యూరియా అందుబాటులో ఉంచడంలో ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విఫలమయ్యారు. ఇప్పటికైనా వెంటనే ఎరువులు అం దించి రైతుల ఇబ్బందులు తొలగించాలి.