Dilsukhnagar : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి(32)ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా.. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా.. జాబ్క్యాలండర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి నివాసి బండారి కుమారస్వామి ఇంటిపట్టునే ఉంటూనే పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. అయితే.. ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అతడు ఇక ఉద్యోగం రాదేమో.. ఎట్లా బతుకుదాం అని తన భార్య స్వప్నతో చెప్పి బాధపడేవాడు.
కుమారస్వామి ఆత్మహత్యకు నిరసనగా దిల్సుఖ్నగర్లో క్యాండిల్ ర్యాలీ తీసిన నిరుద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య చేసుకున్న హన్మకొండకి చెందిన నిరుద్యోగి బండారి కుమారస్వామి https://t.co/fxMMz3YSOz pic.twitter.com/z7e5DIKJ1J
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026
ఉద్యోగం రాకపోయినా ఏమీకాదని వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య చెప్పినా వినలేదు అతడు. జాబ్ సాధించలేకపోయాననే మనస్తాపంతో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కుమారస్వామి. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడని భార్య వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని యువకుడి ఆత్మహత్య
వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య సర్ది చెప్పినా వినకుండా ఆత్మహత్య
హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామంలో నివసిస్తూ, పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న బండారి కుమారస్వామి(32) అనే వ్యక్తి
ఎన్ని ఉద్యోగాలకు… pic.twitter.com/7dmCVnBTnG
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2026