Mulugu | ములుగు జిల్లా వాజేడు మండలం లోని అరుణచలపురం అటవీ ప్రాంతంలోని గుండం జల పాతంలో ఈతకు దిగగా నీట మునిగి హైదరాబాద్ కు చెందిన అక్తరుద్దీన్ (25) అనే యువకుడు మృతి. హైదరాబాద్ కు చెందిన ఆక్తరుద్దీన్ ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి అటవీ శాఖ అధికారులు నిషేధించిన జలపాతంలోకి అనుమతి లేకుండా వెళ్లి స్నేహితులతో కలిసి ఈతకు దిగాడు.
గుండం జలపాతంలో అక్కడక్కడ ఉన్న గుంతల లోతును సరిగా అంచనా వేయకుండా నీటిలో మునిగిపోయాడు స్నేహితులు అక్తరుద్దీన్ ను కాపాడే ప్రయత్నం చేసి జలపాతం నుండి బయటకు తీసి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.