హనుమకొండ చౌరస్తా, జనవరి 12 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మహిళా క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ మహిళా క్రికెట్ సెలక్షన్స్‌కు కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల వివిధ కాలేజీల నుంచి సుమారు 40 మంది మహిళా క్రికెట్ క్రీడాకారిణులు పాల్గొన్నారు. కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య ఈ ఎంపికలను ప్రారంభించారు.
కాకతీయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ సెలక్షన్స్నిర్వహించగా ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు కేయూ తరఫున చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో నిర్వహించనున్న మహిళా సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారని ప్రొఫెసర్ వై.వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మట్టెడా కుమార్, ఎర్ర సుమన్, వెంకన్న, అఫ్జల్, అన్వేష్, వెన్నెల, శ్వేత, సందీప్, పీడీ గోపి పాల్గొన్నారు.