Khilawarangal | గోరుగుట్ట తండాలో బెల్ట్ షాపులు తొలగించాలని కలెక్టర్కు మహిళల ఫిర్యాదు
అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాలను వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఖిలావరంగల్, మార్చి 09 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్ట తండాలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాలను వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గోరుగుట్ట తండా సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 40 మంది మహిళలు పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలో బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాలు అధికంగా ఉండడంతో యువత నిత్యం మద్యం సేవిస్తూ గొడవలకు దిగుతున్నారని మహిళలు కలెక్టర్కు వివరించారు. మద్యం కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరిగి చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను రోడ్లపై పగలగొడుతున్నారని, దీంతో గ్రామంలో తిరిగే పశువులకు, ప్రజలకు గాయాలు అవుతున్నాయని తెలిపారు. కాబట్టి గోరుగుట్ట తండాలో కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకొని వాటిని తొలగించాలని మహిళలు జిల్లా కలెక్టర్ను కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

