కాజీపేట : కాజీపేట పట్టణ పరిధిలోని ఓ జనరల్ స్టోర్లో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. నిట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న దేవాన్ష్ జనరల్ స్టోర్ యజమాని కొండవీటి రాణి షాప్ తెరుస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి వస్తులువులు కొనుగోలు చేస్తున్నట్లు షాప్ యజమానిని నమ్మించి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పసుపు తాడు లాక్కొని వచ్చిన ఆటోలోనే పరారయ్యారు.
దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు డైయల్ 100 కు కాల్ చేయగా స్థానిక కాజీపేట పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆటో నెంబర్ ప్లేట్ కనబడకుండా దుండగులు నెంబర్ను కవర్ చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.