Khila warangal | వరంగల్ రైల్వే స్టేషన్లో విషాదం.. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మహిళ మృతి
వరంగల్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు మహిళ మృతి.
ఖిలావరంగల్, మార్చి 25: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల సమయంలో సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడడంతో దుర్మరణం చెందింది. వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాట్ఫాం నంబర్ 3, 4 వద్ద నిలిచిన ట్రైన్ నెం. 12746 మణుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కుతున్న క్రమంలో గుర్తు తెలియని మహిళ ప్రమాదవశాత్తు జారి ఫ్లాట్ ఫాం, రైలుకు మధ్యలో పడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి చెయ్యి, ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతిని తుంటి వరకు తెగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను గమనించిన ఆన్ డ్యూటీ రైల్వే సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆమెను పరిశీలించి మరణించినట్లు ధృవీకరించారు.
మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు, నగదు లేదా రైల్వే టికెట్ లభించలేదు. ఆమె సుమారు 5 అడుగులు 4 అంగుళాల ఎత్తు, ఎరుపు వర్ణం, నల్లటి వెంట్రుకలు, బక్కపలచగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో రెడ్ అండ్ ఆరెంజ్ రంగు చీర, రెడ్ కలర్ జాకెట్ ధరించి ఉండగా, మెడలో పసుపు దారం, చేతులకు బ్రౌన్ రంగు మట్టి గాజులు ధరించి ఉంది. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖానలో మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతురాలి ఆచూకి తెలిసిన వారు మొబైల్ నెంబర్ 9849749220, 8712658627 సంప్రదించాలని తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

