KV Krishna swamy | న్యూశాయంపేట, ఆగస్టు 16 : హైదరాబాద్ తొలి మేయర్ కేవీ కృష్ణ స్వామి ముదిరాజ్ సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. నగరంలో కృష్ణ స్వామి ముదిరాజ్ 132వ జయంతి పురస్కరించు కొని ఆయన చత్ర పటానికి డాక్టర్ బండ ప్రకాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950లో స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు తొలి ఎన్నికైన మేయర్‌గా పనిచేశారు. ఆయన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు, జర్నలిస్టు, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, హైదరాబాద్ విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.
విద్యాభివృద్ధి కోసం కృషి చేసి, ఆంధ్రపత్రిక సహా పత్రికల్లో రచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వరంగల్ జిల్లా చీపు ప్రమోటర్ చొప్పరి సోమయ్య, కలకొండ అభినాష్, గిన్న రమేష్ పాల్గొన్నారు.
Election | ఓదెల పెరక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Urea shortage | సైదాపూర్‌లో యూరియా కొరత.. వర్షాన్ని లేక్క చేయకుండా రైతుల క్యూ..!
Krishnashtami | చిగురుమామిడిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ