హనుమకొండ చౌరస్తా, జూలై 14: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయే ఛలో సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అర్ధరాత్రివేళ పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున అన్నారు. తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రేవంత్ సర్కార్ను విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తే ఎక్కడికి ఎక్కడ అరెస్టులు చేయడం, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు.
హనుమకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో రాత్రి పూట ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్ని అరెస్టులు చేసిన ఉద్యమాన్ని ఆపలేరని, పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య ఖూనీ చేస్తుందని నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.