నిలిచిన సోలార్ పనులు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప వర్ ప్లాంట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పీఎం కుసుమ్ పథకంలో భాగం గా రూ. 2.97 కోట్ల నిధులతో ఉమ్మడి జిల్లాలోనే తొలి ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రతి రోజూ 4 వే ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ మహిళా సంఘాల ఆధ్వర్యం లో నిర్వహించనున్నారు. ఈ పథకం కింద రూ.కోటి సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే మం డల సమాఖ్య (సెర్ప్) నుంచి రూ.10 లక్షలు వాటాగా చెల్లించారు.
- పురోగతిలేని పవర్ ప్రాజెక్టు
- రూ. 2.97 కోట్లతో ప్లాంట్
- ప్లేట్లు బిగించి వదిలేశారు..
- పట్టింపులేని అధికారులు
శాయంపేట, ఆగస్టు 6 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప వర్ ప్లాంట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పీఎం కుసుమ్ పథకంలో భాగం గా రూ. 2.97 కోట్ల నిధులతో ఉమ్మడి జిల్లాలోనే తొలి ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రతి రోజూ 4 వే ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ మహిళా సంఘాల ఆధ్వర్యం లో నిర్వహించనున్నారు. ఈ పథకం కింద రూ.కోటి సబ్సిడీ అందుతుంది. ఇప్పటికే మం డల సమాఖ్య (సెర్ప్) నుంచి రూ.10 లక్షలు వాటాగా చెల్లించారు. ఈ పనులను ఓ ఏజెన్సీ కి కాంట్రాక్టు అప్పగించగా, వారు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంది. నాలుగెకరాల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ప్యానెళ్ల బిగింపునకు ప్లేట్స్ మాత్రమే బిగించారు. ఆ త ర్వాత పనులు ఉన్నట్టుండి నిలిపివేశారు.
ఈ క్రమంలో కాంట్రాక్టు ఏజెన్సీ మండల మహి ళా సమాఖ్యకు యూనిట్‌కు రూ. 3.13లను చెల్లిస్తుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్కు విక్రయిస్తుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో మహిళలు ఆర్థికాభివృద్ధ్దికి నిర్దేశించారు. అయితే ఆరు నెలలుగా నిర్మాణ ఏజెన్సీ పనులను వదిలేయడంతో సోలార్ పవర్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిర్ధేశిత గడువు ముగిసినా కాంట్రాక్టు సంస్థ పనులపై దృష్టి పెట్టడం లేదు. రెండునెలల క్రితమే ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నా పనుల్లో పురోగతి లేదు. ఈ విషయంపై శాయంపేట ఐకేపీ ఏపీఎం వేణుగోపాల్‌రావు వివరణ కోరగా సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కాంట్రాక్టు ఏజెన్సీ ఆపేసినట్లు తెలిపారు. దీంతో వారికి సెర్ప్ సీఈవో నుంచి నోటీసులు పంపించారని తెలిపారు. అయినా స్పందన లేదని చెప్పారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

