జయశంకర్ సార్‌కు నివాళి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పాత్ర కీలకమైనదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.
నస్పూర్/మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పాత్ర కీలకమైనదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. సర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, రెవెన్యూ అధికారి మోతీరాం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావుదేశ్‌పాండే ఉన్నారు.
రామగుండము పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని కొనియాడారు. ఇక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ హరిత, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాశ్, వైస్ చైర్ పర్సన్ ఎండీ అహ్మద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధి అలీబిన్ అహ్మద్, ఆసిఫాబాద్ మారెట్ కమిటీ చైర్మన్ మంగ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయాచోట్ల జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నదీమ్, వివిధ శాఖల జిల్లా అధికారులు అంబాజీ, భిక్షపతి,దత్తారావు, నాయకులు సరస్వతీ, వెంకన్న, జీవన్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

