నీటి సరఫరా ఎప్పుడో!.. ఎనిమిదో రోజులైనా కొలిక్కిరాని సమస్య
మంచిర్యాలలోని రాళ్లవాగులో కొట్టుకు పోయిన పైపులైన్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి తాగునీరు సరఫరాకాక గురువారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి.
- మంచిర్యాల రాళ్లవాగులో కొనసాగుతున్న పైపులైన్ మరమ్మతులు
మంచిర్యాలటౌన్, ఆగస్టు 6 : మంచిర్యాలలోని రాళ్లవాగులో కొట్టుకు పోయిన పైపులైన్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి తాగునీరు సరఫరాకాక గురువారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఈ సమస్య ఇన్ని రోజులు కొనసాగడానికి పాలక, అధికార పక్షాల అనుభవ లేమి, అవగాహనరాహిత్యమేనన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. గడిచిన 60 ఏళ్లలో ఏనాడూ నీటి సరఫరా నిలిచిపోలేదని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రేయింభవళ్లు కష్టపడి ఒకటీ రెండు రోజుల్లో నీటి సరఫరా చేసిన సందర్భాలు ఉండేవని, అప్పుడు ఇంతకన్నా పెద్దసమస్యలు ఎదురయ్యాయని, ఇపుడున్నంత టెక్నాలజీ కూడా అప్పుడు ఉండేది కాదని చెబుతున్నారు. జూలై నెల చివరివారంలో కురిసిన వర్షానికి రాళ్లవాగు ప్పొంగి ప్రవహించింది. అయితే మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జలగుట్ట నుంచి పట్టణంలోని వాటర్ ట్యాంకులకు నీరు సరఫరా చేసే ప్రధాన పైపులైన్లు ఈ రాళ్లవాగులోని రంగంపేట కాజ్వే పక్కనుంచే నిర్మించారు.
వరద ఉధృతి కారణంగా పైపులైన్లు కొట్టుకుపోయిన విషయాన్ని మూడురోజులకు గుర్తించిన అధికారులు తిరిగి పైపులైన్లను పున:రుద్ధరించడంలో అపసోపాలు పడుతున్నారు. మరో పక్క లక్షకు పైగా జనాభా ఉన్న మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ నల్లానీటిపైనే ఆధారపడే కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరంతా తాగునీటితో పాటు వారి ఇంటి అవసరాల కోసం ఉపయోగించే నీటికోసం తండ్లాడుతున్నారు. పైపులైను మరమ్మతులు చేపడుతున్నా, రాళ్లవాగులో నీటి ప్రవాహం తగ్గని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాగులోని ప్రవాహాన్ని మరో పక్కకు మరల్చే చర్యలు చేపడుతున్నారు. దీంతో సమస్య కొలిక్కి వస్తుందన్న ఆలోచనతో ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

