కాశీబుగ్గ మర్చి 29 : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చిన్న సంఘాల పాస్టర్ల సంక్షేమమే ధ్యేయంగా వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ చైర్మన్ సరిగొమ్ముల దీన్ దయాళ్ అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ లోగల సీఎస్ఐ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పాత కమిటీని రద్దుచేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈసందర్భంగా సొసైటీ చైర్మన్ దీన్ దయాళ్ మాట్లాడుతూ.. ఇటీవల ఒకరిద్దరూ వ్యక్తులు సొసైటీ కోర్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన నూతన కమిటీ చెల్లదన్నారు.
ఆదివారం క్రిస్టియన్ సొసైటీ కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఖిలా వరంగల్, వరంగల్ మండల పరిధిలోని పాస్టర్లు, వివిధ సంఘాల ప్రతినిధుల సమక్షంలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, వరంగల్ క్రిస్టియన్ సొసైటీ నూతన కమిటీ నూతన కమిటీ చైర్మన్ గా సరిగోమ్ముల దీన్ దయాళ్, గౌరవధ్యక్షునిగా రేవ.పుల్లా జగ్జను ఎన్నుకున్నారు.