Volleyball | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 16: హనుమకొండ ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో వాలీబాల్ బాలబాలికల అండర్-15, సుభ్రతో కప్ ఫుట్‌బాల్ అండర్ 15, 17 బాలుర ఎంపికలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ క్రీడల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇక్కడ ఎంపికైన వాలీబాల్ క్రీడాకారులు ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ర్టస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని హనుమకొండ ఎస్జీఎఫ్ కార్యదర్శి వి ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
అలాగే ఫుట్‌బాల్ క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ర్టస్థాయి పోటీలలో ఈనెల 21, 22 తేదీల్లో పాల్గొంటారని వి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఈ సెలెక్షన్లలో టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్ పార్థసారథి, జనగామ జిల్లా వాలీబాల్ సెక్రెటరీ ఎం యాదిరెడ్డి, వాలీబాల్ కన్వీనర్ టి రాముడు, వాలీబాల్ కోచ్ జీవన్, టీజీపీటీఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి సుధాకర్, టీజీపీఈటీఏ జిల్లా జాయింట్ సెక్రెటరీ నీలం సురేష్, పీడీలు ఎన్.శ్రీధర్ ఎం.సురేష్, బాలమురళి, స్వప్న, నిఖిల్, సుభాష్ పాల్గొన్నారు.
Election | ఓదెల పెరక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Urea shortage | సైదాపూర్‌లో యూరియా కొరత.. వర్షాన్ని లేక్క చేయకుండా రైతుల క్యూ..!
Krishnashtami | చిగురుమామిడిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ