హనుమకొండ (ఐనవోలు): ప్రజల ఇబ్బందుల తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలుమార్లు మోరపెట్టుకున్న ఫలితం లేదు.. పత్రికలు సమస్యను ఎత్తి చూపిన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుమారలేదు.. దీంతో ‘ఎవరో వస్తారు ఏదో చేస్తారు’ అని ఎదురు చూడకుండా ఆ గ్రామానికి చెందిన ఆటో కార్మికులు, గ్రామస్తులు ఏకమయ్యారు. దీంతో నెలల తరబడి పెరుకుపోయిన సమస్యకు కొంత మేర ఉపశమనం కల్గించుకున్నారు. ఆసలు ఆ సమస్య ఏంటి.. ఎలా తీర్చుకున్నరో వివరాల్లోకి వెళ్తే.. ఐనవోలు (Inavolu) మండలంలోని కొండపర్తి గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఐనవోలు నుంచి కొండపర్తికి, భట్టుపల్లి నుంచి కొండపర్తికి, వరంగల్ నుంచి కొండపర్తి, వనమాలకనపర్తి నుంచి కొండపర్తికి నలగు వైపు నుంచి రోడ్లు మంజూరి అయ్యాయి. రోడ్ల పనులు ప్రారంభమైన సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
దీంతో కొండపర్తి గ్రామానికి నలుదిక్కుల రోడ్లు నిర్మాణ పనులు నత్తనడక సాగుతూ కొండపర్తి గ్రామస్తులకు శాపంగా మారాయి. అయితే కొండపర్తి నుంచి ఐనవోలు వెళ్లే రోడ్డు మాత్రం ముల్కలగూడెం ఊరు శివారు వరకు రోడ్డు వేసి వదిలేశారు. ఇంకా ఒంటిమామిడిపల్లి మీదుగా ఐనవోలుకు లింక్ చేయాల్సి ఉంది. ఎన్నిసారు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకపోయిన లాభం లేకపోవడంతో గురువారం సాయంత్రం ప్రెండ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సాంబరాజు మిగిలి ఆటో డ్రైవర్లు, గ్రామస్తులు కలిసి గ్రామంలో ఉన్న క్వారీ దగ్గరకు వెళ్లి మట్టి కవాలని అడిగి కొండపర్తి నుంచి వరంగలు వెళ్లె రోడ్డుకు సుమారుగా కిలో మీటర్ వరకు మొరం పోయించి రోడ్డుకు తాత్కలికంగా మరమ్మతులు చేశారు. దీంతో ఆటో యూనియన్ కార్మికులు చేసిన పనికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.