హనుమకొండ (ఐనవోలు): హ్యండ్ బ్యాగ్ పోయింది. దొరికితే తిరిగి అప్పగించాలని బాధితురాలు వేడుకుంటుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఐనవోలు మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన సమీపంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన బండి మంజుల అనే భక్తురాలు సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఆలయానికి వచ్చింది.
కాగా, ద్విచక్రవాహన పై ఇద్దరి మధ్యలో పెట్టుకున్న హ్యండ్ బ్యాగ్ ఆలయా ముఖ్యద్వారం సమీపంలో పడిపోయిన్నట్లుగా తెలిపారు. బ్యాగ్లో ల్యాండ్ ఓరిజినల్ డాక్యుమెంట్, ఏటీఎం, కొంత మేరకు నగదు ఉన్నాయి. ఎవరికైనా బ్యాగ్ దొరికితే ఈ సెల్ నెంబర్ 9849204802 సమాచారం అందించాలని, పోలీసుస్టేషన్, ఈవో కార్యాలయంలోనైనా అప్పగించాలని బాధితురాలు కోరుతుంది. బ్యాగ్ అప్పగించిన వారికి తగిన పారితోషకం అందిస్తామని పేర్కొన్నారు.