ధర్మసాగర్ : ధాన్యం కొనుగోలుల విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ధాన్యంలో తరుగు పేరిట 2కిలోల ధాన్యాన్ని ఎక్కువ తూకం వేస్తున్నారని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. సాకులు చెప్పకుండా రైతులు తెచ్చిన ధాన్యాన్ని 41 కిలోల వరకే తూకం వేయాలన్నారు. మిల్లర్లు మానవతాదృక్పథంతో రైతుల ధాన్యాం బస్తాల నుండి కోత పెట్టొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు బైరపాక కుమార్, అమరేందర్ రెడ్డి, దుస్స రాములు, తదితరులు పాల్గొన్నారు