BRS Leaders | వేలేరు, డిసెంబర్ 11 : స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామపంచాయతీ కి నిధులు వస్తాయని చెప్పడం సిగ్గుచేటని వేలేరు మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థి ఇట్టబోయిన భూపతిరాజు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం వేలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వేలేరు మండలం ఏర్పాటు ముమ్మాటికీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి సహకారంతోనే అని తెలిపారు.
వేలేరు మండలానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను నీళ్లు తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గ్రామాలలో రైతులు యూరియా బస్తాల కోసం అరిగోసలు పడుతున్నారని, ఎమ్మెల్యే కడియంకు ఏ మాత్రం బాధ్యత ఉన్నా రైతుల సమస్యలను పరిష్కరించాలని సవాల్ విసిరారు.
ఓ అధికారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తన ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. అధికారి తీరును ప్రజలు గమనిస్తున్నట్లు చెప్పారు. మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం మోసపూరిత వ్యాఖ్యలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల ఇంచార్జ్ ఇట్టబోయిన భూపతిరాజు, నాయకులు సూత్రపు సంపత్, ఫారూఖ్, సదానందం, మహిళ అధ్యక్షులు స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.
e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్..