Thousand Pillers Temple | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో సోమవారం రుద్రేశ్వరునికి రుద్రాభిషేకాల నిర్వర్తించి సంకటహర చతుర్ధిని పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంచామృతాభిషేకం సుగంధ పరిమళ ద్రవ్యములతో హరిద్రకుంకుమ విలేఖనములతో శ్రీమహాగణపతి అధర్వణశీర్షిక మూల మంత్రములు ఋగ్వేద మంత్రయుక్తంగా అభిషేకం నిర్వహించి దూర్వపత్రాలు(గరిక) సహస్రనామార్చన నిర్వహించి క్షీరాన్న నైవేద్యం సమర్పించి నీరాజనం మంత్రపుష్పం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
వైదిక కార్యక్రమాలను పెండ్యాల సందీప్‌శర్మ, ఆలయ వేదపండితులు గంగు మణికంఠ శర్మ, ప్రణవ్, శ్రవణ్‌కుమార్, గంగు ఉపేంద్ర శర్మ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వాహణ అధికారి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దేవాలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంధువులు సందర్శించి పూజలు నిర్వహించారు.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
ICC | భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో భారీ కోత..!