కాజీపేట: కారు ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కాజీపేట పట్టణం సోమిడి శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సోమిడి నుంచి తాళ్ల పద్మావతి వైపు రోడ్డుపై వెళుతున్న ఓ కారు అదుపుతప్పి అటు నుంచి సోమిడికి వస్తున్న ఆటోను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో సోమిడి కి చెందిన ముడికే కార్తీక్ (20), మహేష్ (20), సందీప్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం కార్తీక్, మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.