Lingala Ghanpuram | జనగామ జిల్లాలో కారు ఢీకొని గీత కార్మికుడి మృతి
సూర్యాపేట -జనగామ జాతీయ రహదారిపై నెల్లుట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు.
లింగాల గణపురం : జనగామ జిల్లా సూర్యాపేట -జనగామ జాతీయ రహదారిపై నెల్లుట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లింగాల గణపురం మండలంలోని బండ్లగూడ కు చెందిన గీత కార్మికుడు బండి రాంనర్సయ్య తన మోపైడ్‌పై వెళుతూ నెల్లుట్ల వద్ద డివైడర్‌ను దాటుతుండగా..జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో బండి రామ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మల్లమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

