హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థుల కోసం ఉద్యోగ మేళాను(Job fair) మంగళవారం కాలేజీ ఎంబీఏ విభాగంలో నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకునేలా ఉద్యోగమేళాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఉద్యోగ మేళాలో కే-12 టెక్నోవిజన్, అనుదీప్ ఫౌండేషన్ సంస్థలు పాల్గొని పేరెంట్ రిలేషన్ ఆఫీసర్, ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగమేళా మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కొనసాగుతుందని, అర్హత కలిగిన డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కార్యక్రమంలో కాలేజీ ఉద్యోగ కల్పన సహాయ కేంద్రం సంచాలకులు జితేందర్, సంబంధిత సంస్థల అధికారులు, అధ్యాపకులు గిరిప్రసాద్, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.