న్యూశాయంపేట,జనవరి 23 : హనుమకొండ నిట్ సమీపంలోని తారా గార్డెన్లో భావనారుషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన చేనేత వస్త్ర ప్రదర్శనను శుక్రవారం కార్పొరేటర్ ఏనుగుల మానస ప్రారంభించారు. ఇక్కడ కొలువుదీరిన చేనేతకారులు వస్త్ర ఉత్పత్తులను తిలకించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడవుతూ.. భారతీయ సంస్కృతిలో చేనేత ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. నేటి యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నిర్వాహకులు సిహాంద్రి సురేష్ లు మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పలు రాష్ట్రాల నుండి చేనేతకారులు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారన్నారు.