KU VC Pratapreddy | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18 : కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ ప్రాంతాల్లో ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్న పాత రేకులు, స్తంభాలు, స్టీల్ రాడ్లు, చెక్క సామాన్లు, ఇనుప టేబుళ్లు, టైల్స్, పాలిష్రాళ్లు, ఇతర నిర్మాణ సామాగ్రిని సేకరించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి గణితశాస్త్రం అధ్యాపకులు, విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు. ఈ సేకరించిన సామాగ్రితో, విభాగ అధ్యాపకులు, సిబ్బంది ఆర్థిక సహాయంతో విభాగంలో వాహనాల పార్కింగ్ స్టాండ్, షటిల్ కోర్ట్, విద్యార్థులు, పరిశోధకులు చిన్న సమావేశాలు జరుపుకునేందుకు ఓ చిన్న భోజనశాల తయారు చేసుకున్నారు.
ఈ నిర్మాణాల ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు, విభాగ కార్యకలాపాల నిర్వహణలో, సౌలభ్యం, విభాగ ఆవరణ సుందరీకరణ లక్ష్యాలను చేసుకున్నామని విభాగాధిపతి ఆర్ భారవిశర్మ తెలిపారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర విభాగం చేపట్టిన ‘నిరూపయోగం నుంచి ఉపయోగం’ కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ప్రశంసిస్తూ, పాత వనరులను వినియోగంలోకి తీసుకువచ్చే ఈ ప్రయత్నం విశ్వవిద్యాలయానికి ఆదర్శమన్నారు. ఇతర విభాగాలు కూడా ఇలాంటి సంస్కరణలను చేపట్టాలని అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడు పెరటి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారిణి ఎం. రుమలదేవి, సోమయ్య, వెంకటరామిరెడ్డి, వై వెంకయ్య, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి