హనుమకొండ చౌరస్తా, మార్చి 16 : మోకాలి గాయంతో చికిత్స పొందుతూ విశ్రాంతి పొందుతున్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
కే శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. హనుమకొండ రాంనగర్లోని నాగరాజు నివాసానికి చేరుకున్న ఆయన నాగరాజు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
గాయం మానటానికి మరి కొంతకాలం పడుతుందని, అప్పటివరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు నాగరాజు శ్రీనివాసరెడ్డికి వివరించారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని రోజువారి పనిలో నిమగ్నం కావాలని శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.