సుబేదారి : వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ, విటులను టాస్క్ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా చెందిన ఓ మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి మహిళలను రప్పించి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో బుధవారం జనగామకు చెందిన బంతిని అశోక్, కరుణాకర్ ఘన్పూర్కు చెందిన వడ్లకొండ రమేష్, కాజీపేటకు చెందిన బొల్లి శ్రీనివాస్ ఇద్దరు మహిలళతో ఒప్పందం కుదుర్చుకొని వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పోలీసులు బాధిత మహిళలను కాపాడి రెస్క్యూ హోంకు తరలించారు. వ్యభిచార నిర్వాకురాలు లలిత, విటులను అదుపులోకి తీసుకున్నారు. విటుల నుంచి 5 సెల్ఫోన్స్, రూ.2,450 నగదు, కండోమ్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ మాట్లాడుతూ ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పద్ధతి మార్చుకోకుంటే నిర్వాహకులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.