హనుమకొండ చౌరస్తా, మార్చి 25: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైం ఉద్యోగాల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కేయూ ఇంచార్జి డాక్టర్ వడ్డేపల్లి మధు, భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్రనాయకులు పాలమాకుల కొమురయ్య, మద్దిరాల మోహన్‌రెడ్డి, మహమ్మద్ పాషా డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలోని గ్రంథాలయ ఆవరణలో విద్యార్థి సంఘాలు, కేయూ డాక్టరేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పది సంవత్సరాల నుంచి కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైం నోటిఫికేషన్ లేకపోవడంతో కేయూకి ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నిరాశ ఎదురవుతుందన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో యూనివర్సిటీ అధికారులు విఫలమయ్యారన్నారు. విద్యార్థులు రోడ్లమీదకి వచ్చి పాఠాలు బోధించాలని గొడవ చేస్తున్నారని, కేయూలో 400 మంది ప్రొఫెసర్ ఉండేవారు. కానీ ఇప్పుడు 72 మంది మాత్రమే మాత్రమే ఉన్నారు. చాలామంది ప్రొఫెసర్స్ రిటైర్ అయ్యారు. మిగతా ప్రొఫెసర్స్ నామినేటెడ్ పదవుల వలన వారికి పాఠాలు బోధించడానికి సమయం ఉండడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును, కేయూ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్ట్‌టైం రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, వెంటనే పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ రాష్ర్ట సమితి హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ ఆరూరి రంజిత్, వంగ మల్లేష్‌గౌడ్, ఉర్సు రాజేందర్, అనిల్, సునీల్, సురేష్, రాజు, అఖిల్ పాల్గొన్నారు.