Student unions | సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం
హనుమకొండలోని జూనియర్ కాలేజీ జంక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి.
హనుమకొండ చౌరస్తా, జూలై 10 : హనుమకొండలోని జూనియర్ కాలేజీ జంక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాలు దహనం చేశాయి. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని పిడిఎస్యు, డిఎస్ఎ, టిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌లో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల నాయకులు దుర్గం సారయ్య, కామగోని శ్రావణ్, జె.భారత్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, గురుకులాలకు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియచేస్తున్న విద్యార్థి సంఘ నాయకుల అక్రమ అరెస్టులను వారు ఖండించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఇచ్చిన బంద్ విజయవంతమైం దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, క్రాంతి, జాషువా, సంపత్, చరణ్,కమల్, హరీష్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

