Kidney Stones | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27 : అత్యంత క్లిష్టమైన అరుదైన కిడ్నీ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి ఒకే కిడ్నీ నుంచి 1820 రాళ్లను తొలగించినట్లు హనుమకొండలోని శ్రీశ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యుడు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన దినసరి కూలి కడకంచి పర్శరాములు ఈ నెల 23న కిడ్నీ నొప్పితో ఆసుపత్రికి
వచ్చాడన్నారు. ఈ కేసును డూప్లెక్స్మొయిటీ (ఒకే కిడ్నీలో ద్వంద మూత్రపిండం)గా గుర్తించి.. కిడ్నీలో 1820 రాళ్లు ఉన్నాయని నిర్ధారించుకున్నామని తెలిపారు. తర్వాత మల్టీట్రాక్ పీసీఎన్ఎల్ అనే పద్ధతిలో ఒకే సిట్టింగ్‌లో మొత్తం రాళ్లను తొలగించినట్లు వెల్లడించారు.
పరశరాములు తమ వద్దకు రాకముందు హనుమకొండ, హైదరాబాద్ లాంటి నగరాల్లోని అనేక ఆసుపత్రిలో సంప్రదించగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ అని.. రెండు నుంచి మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికి రాళ్లు మొత్తం తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారని తెలిపారు.
ఇవన్నీ చేసేందుకు రూ.3.5 లక్షలకుపైగా ఖర్చవుతుందని చెప్పడంతో రోగి భయభ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ఆ తర్వాత తమ ఆసుపత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీలో ఉచితంగా కిడ్నీలోని 1820 రాళ్లను తొలగించినట్లు, రోగిని 72 గంటలలోపు పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ చేయగా రోగితో పాటు రోగి బంధువులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి