Teachers Conference | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఎస్సీఈఆర్టీ (SCERT) ఆధ్వర్యంలో హైదరాబాద్ గోదావరి ఆడిటోరియంలో సెకండరీ స్కూల్ విద్యార్థుల విద్యా పనితీరుపై కౌన్సెలింగ్ ప్రభావం అంశంపై రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సదస్సు ఘనంగా జరిగింది.
ఈ సదస్సుకు రాష్ట్రం మొత్తం మీద 30 మంది ఉపాధ్యాయుల పరిశోధన పత్రాలు ఎంపిక చేయగా.. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పీఎం శ్రీ హై స్కూల్, ఒంటిమామిడిపల్లిలో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చిదురాల శ్రీనివాస్, తన గురువు రవికాంత్ రావు మార్గదర్శకత్వంలో సిద్ధం చేసిన పరిశోధన పత్రం సమర్పించారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఈ పరిశోధన పత్ర సమర్పణ అక్టోబర్ 15న సాయంత్రం జ్యూరీ సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి పరిశోధన పత్రం సమర్పణ కార్యక్రమానికి SCERT డైరెక్టర్ జి రమేష్ ముఖ్య అతిథిగా హాజరవగా.. ఉస్మానియా విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగ ప్రొఫెసర్ రమాదేవి, బిఈడి కళాశాల సైకాలజీ ప్రొఫెసర్ స్వాతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
రాష్ట్రం మొత్తం మీద అధిక సంఖ్యలో ఊపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ను డైరెక్టర్ రమేష్ అభినందించారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.