హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పంచరాత్ర ఆగమానుసారంగా స్వామివార్లకు పూజలు నిర్వర్తించి పురుషోత్తముడిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
పాయసాన్న నైవేద్యం సమర్పించి నీరాజన మంత్రపుష్పాలు అనంతరం రామభక్తులు త్యాగరాజ కీర్తనలు పాడుతూ చిన్నచిన్న మాటల్లోనే గొప్ప అర్థాలిచ్చే కీర్తన ‘శ్రీరామ నీకు మొక్క నీ చేతికి చిక్కిన వంటి కీర్తనలు పాడుతుండగా హనుమత్ వాహనసేవలో స్వామివారు మంగళవాయిద్యాలు, మంగళహారతులతో గ్రామోత్సవం నిర్వహించుకున్నారు.
ప్రముఖ న్యాయవాది రవీందర్రావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో నవగ్రహ పంచసూక్త మహాసుదర్శన హోమం లోకకళ్యాణార్థం భక్తులకు ఈ సంవత్సరం అనుకూలిత ఫలితాలివ్వాని హోమం నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్, అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, శ్రవణ్, భక్తులు పాల్గొన్నారు.