Spot Admissions | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల్లో వివిధ తరగతుల ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
ముల్కనూర్ కేజీబీవీలో 22, ధర్మసాగర్ సీఈసీలో 15, ఎల్కతుర్తిలో 48, హసన్‌పర్తి సీఈసీలో 14, శాయంపేట బైపీసీలో 20, వేలేరు కేజీబీవీలో 33 సీట్లను నింపడం జరుగుతుందని పేర్కొన్నారు. మోడల్ స్కూల్ ముల్కనూర్ పాఠశాలలో 158, కాలేజీలో 49, ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో 234, కాలేజీలో 47, కమలాపూర్ మోడల్ స్కూల్లో 311, కాలేజీలో 18 సీట్లను నింపడానికి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులందరూ పూర్వ మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, టీసీతో సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలవాలని సూచించారు.