మడికొండ, జూలై : గ్రేటర్ 63వ డివిజన్ కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్లోని చిరు వ్యాపారాలు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం మాట్లాడుతూ వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ గురించి అనేకసార్లు కాజిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నాg. కానీ అధికారులు మా వినతులను పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్ల పైన చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తుండటంతో మార్కెట్లోకి ఎవరూ రావడం లేదని, మార్కెట్లో వ్యాపారం జరగడం కష్టంగా మారిందన్నారు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించాలని, లేనియెడల వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ వ్యాపారులచే కాజీపేట మున్సిపల్ కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు చాంద్ పాషా, మార్కెట్ అధ్యక్షుడు నిషాని భిక్షపతి, ఏసు, కళమ్మ, కొమరమ్మ, స్వరూప, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.